ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు భాజపా నాయకులు బైఠాయించారు. తెరాస ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని స్వచ్ఛభారత్ రాష్ట్ర కన్వీనర్ నాగరాజు నామాజీ దుయ్యబట్టారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై పూర్తిగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అందరూ సహకరించాలని కోరారు. పోలీసులు భాజపా నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన భాజపా నాయకులు - ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన భాజపా నాయకులు
ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు భాజపా నాయకులు బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన భాజపా నాయకులు