తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణపేటలో ఇంటిని తలపించే వసతి గృహాలు

వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఇంటి వాతావరణాన్ని తలపించేలా అధికారులు కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్​ వెంకట్రావు సూచించారు. ఒక్కో వసతి గృహానికి ప్రత్యేక అధికారిని నియమించి విద్యార్థుల బాగోగులు చూడాలని ఆదేశించారు.

నారాయణపేటలో ఇంటిని తలపించే వసతి గృహాలు

By

Published : Nov 23, 2019, 8:57 AM IST

నారాయణపేట జిల్లాలో వసతి గృహ విద్యార్థులకు మంచి రోజులు రాబోతున్నాయి. వసతి గృహాల్లో ఉన్న సమస్యలు నివారించి గాడిలో పెట్టేందుకు కలెక్టర్​ వెంకట్రావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే విధంగా ఆత్మీయుడు.. విద్యార్థులకు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

నారాయణపేటలో ఇంటిని తలపించే వసతి గృహాలు

ఈ కార్యక్రమంలో భాగంగా... జిల్లాలోని ప్రతి అధికారికి ఒక వసతిగృహాన్ని అప్పగించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు ఇంటి వాతావరణాన్ని కల్పించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగించే విధంగా చొరవ తీసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details