నాగార్జునసాగర్‌లో నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజే గడువు ఉంది. అయినా కాంగ్రెస్ మినహా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ ప్రక్రియలో నాలుగో రోజైన శుక్రవారం 10 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి(ఆర్వో) బి.రోహిత్‌సింగ్ తెలిపారు. కొత్తగా 8మంది అభ్యర్థులు నామపత్రాలు (నామినేషన్లు) వేయగా మరో రెండింటిని ఇప్పటికే నామినేషన్లు సమర్పించిన ఇద్దరు అభ్యర్థులు దాఖలు చేశారు.
నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజే మిగిలింది.. అభ్యర్థులను ప్రకటించని తెరాస, బీజేపీ
నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామపత్రాల దాఖలుకు ఇంకా ఒక్కరోజే గడువు ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. మార్చి 27 నాలుగో శనివారం, 28 ఆదివారం, 29 హోలీ పండుగ కావడం వల్ల మార్చి 30వ రోజు మాత్రమే నామినేషన్ల స్వీకరణకు చివరరోజు.
ఈ నెల 30 నామినేషన్ల దాఖలుకు చివరిరోజు. 27న నాలుగో శనివారం, 28న ఆదివారం, 29న హోలీ సందర్భంగా సెలవులు ప్రకటించడంతో 30వ తేదీన మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామని ఆర్వో తెలిపారు. భాజపా సాగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నివేదితరెడ్డి రెబల్‌గా నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెదేపా నుంచి మువ్వా అరుణ్‌కుమార్, మహాజన సోషలిస్ట్ పార్టీ నుంచి ముదిగొండ వెంకటేశ్వర్లు, సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి వడ్లపల్లి రామకృష్ణారెడ్డి, బహుజన ముక్తి పార్టీ నుంచి కందెల శంకరయ్య నామినేషన్లు దాఖలు చేశారు.