జాతీయ లోక్ ఆదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి అవకాశం కల్పించామని నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రమేశ్ వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లా కోర్టులోని న్యాయసేవ సదన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
'కేసుల పరిష్కారానికి ఇదో చక్కని అవకాశం'
పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ ఆదాలత్ ఓ చక్కని అవకాశమని నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రమేశ్ తెలిపారు. రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించి బాధితులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని ఆయన సూచించారు. జిల్లా కోర్టులోని న్యాయసేవ సదన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
'కేసుల పరిష్కారానికి ఇదో చక్కని అవకాశం'
ఓ రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన బాధితురాలికి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రూ.12 లక్షల పరిహారం అందేలా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో దాదాపు 1500 కేసులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా సమస్యలను రాజీమార్గంలో పరిష్కరిస్తే కోర్టులకు అదనపు ఖర్చులు, సమయం ఆదా అవుతాయని అన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేశారు.