రాబోయేది 'హంగ్ అసెంబ్లీ'.. KCR మాతో కలవాల్సిందే : ఎంపీ కోమటిరెడ్డి
11:46 February 14
రాబోయేది 'హంగ్ అసెంబ్లీ'.. KCR మాతో కలవాల్సిందే : ఎంపీ కోమటిరెడ్డి
komatireddy venkatreddy sensational comments : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అందరం కష్టపడితే 40-50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి తెలిపారు.
'కాంగ్రెస్ అధికారంలో ఉండటం మాత్రం ఖాయం. పార్టీలోని ఏ ఒక్కరితో కాంగ్రెస్‌కు అన్ని సీట్లు కూడా రావు. నేను గెలిపిస్తా అంటే.. మిగిలినవారు ఇంట్లోనే ఉంటారు. నేను స్టార్ క్యాంపెయినర్‌ను.. ఒక్క జిల్లాలోనే ఎందుకు తిరుగుతా? మార్చి మొదటి వారం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తాను. పాదయాత్ర ఒక్కటే కాదు... బైకుపై కూడా పర్యటిస్తా. పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై పార్టీ అనుమతి తీసుకుంటాను' అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: