గ్రామీణుల్లో చైతన్యం వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని... మంత్రి జగదీశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నీరు వృథాగా పోతున్నా... చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతున్నా చాలా ఊర్లల్లో పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలో నిర్వహించిన సభలో... పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి స్వగ్రామమైన ఉరుమడ్ల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సోదరుడు కృష్ణారెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించి వెంటనే మంత్రికి చెక్కు అందించారు. కృష్ణారెడ్డి ఉదారతను మంత్రులు అభినందించారు.
గ్రామీణుల్లో చైతన్యం వస్తేనే అభివృద్ధి సాధ్యం... - 30 రోజుల ప్రణాళిక
నీరు వృథాగా పోతున్నా... చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతున్నా... చాలా గ్రామాల్లో పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా నల్గొండ జిల్లా ఉరుమడ్లలో మంత్రి పర్యటించారు.
Minister_Jagadheesh_On_Villages_in_30_days_action_plan