తెలంగాణ

telangana

By

Published : Jan 17, 2021, 10:07 PM IST

ETV Bharat / state

'మంత్రివర్గంలో మాదిగలకు స్థానం ఎందుకు కల్పించలేదు'

సాగర్ ఉప ఎన్నికలో మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి భరిలో ఉంటారని ఎమ్మార్పీఎస్ వ్యస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానం ఎందుకు లేకుండా పోయిందని ప్రశ్నించారు. సాగర్​లో రెడ్డి సంక్షేమ భవనంలో ఎస్సీ ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర సదస్సుకు హాజరయ్యారు.

Manda Krishna at the SC Job Federation Conference
ఎస్సీ ఉద్యోగ సమాఖ్య సదస్సులో మంద కృష్ణ

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మహాజన సోషలిస్టు పార్టీ నుంచి అభ్యర్థి భరిలో ఉంటారని ఎమ్మార్పీఎస్ వ్యస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. రాష్ట్ర జనభాలో అత్యధికంగా 12శాతం ఉన్న మాదిగలకు కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.

ఎలా అడుగుతారు..

నాగర్జునసాగర్ రెడ్డి సంక్షేమ భవనంలో మాదిగ ఉద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించన రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిధిగా మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు. మంత్రివర్గంలో ఎస్సీలకు స్థానం లేకుండా చేసినప్పుడు.. మా ఓట్లు తెరాస నేతలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

ఒక్క శాతం లేని తెలగ రెడ్లకు మాత్రం కేసీఆర్​తో పాటు నలుగురు మంత్రులు ఉన్నారని ఆరోపించారు. దళితులకు 3ఎకరాల భూమి పంపిణీ చేస్తామన్న గత ఎన్నికల హామీ అమలు జరగలేదని విమర్శించారు.

తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. సీఎం కేసీఆర్.. నిండు శాసనసభలో 2018 నవంబర్ 6న అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో నెల్లికల్ లిఫ్ట్​కు శంకుస్థాపన చేస్తానన్నారు. ఆ మాట అమలు చేయలేదు.

-మంద కృష్ణ మాదిగ

ఇదీ చూడండి:'కుటుంబ పాలన పోవాలి... భాజపా ప్రభుత్వం రావాలి'

ABOUT THE AUTHOR

...view details