తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పుల పాలు చేశారు: ఎంపీ కోమటిరెడ్డి - నల్గొండ జిల్లా

నల్గొండ జిల్లాలోని పాతబస్తీ హనుమాన్​ నగర్​లో ఏర్పాటు చేసిన వినాయకుడిని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు.

కేసీఆర్​ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు: ఎంపీ కోమటిరెడ్డి

By

Published : Sep 12, 2019, 12:47 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ హనుమాన్ ​నగర్​లో ఏర్పాటు చేసిన వినాయకుడిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ అప్పుల పాలు చేశారని విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్​ ప్రజలకు నిరాశ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని కేసీఆర్​ అప్పుల పాలు చేశారు: ఎంపీ కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details