తెలంగాణ

telangana

ETV Bharat / state

Gold Medals for India: అంతర్జాతీయ పోటీల్లో భారత్​ సత్తా.. 2 గోల్డ్ మెడల్స్ సాధించిన తెలంగాణ వాసి

Gold Medals for India : శ్రీలంకలో జరుగుతున్న అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​ పోటీల్లో తెలంగాణ వాసి భారత్​కు రెండు బంగారు పతకాలు సాధించారు. నల్గొండ జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి పరుగు పందెం, షాట్​పుట్ క్రీడల్లో దేశానికి గోల్డ్​మెడల్ తీసుకొచ్చారు.

Gold Medals for India
Gold Medals for India

By

Published : Dec 16, 2021, 9:50 AM IST

Gold Medals for India : శ్రీలంకలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఛాంపియన్​షిప్ పోటీల్లో నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి రెండు బంగారు పతకాలు గెలుచుకుకున్నారు. అండర్ -45 విభాగంలో 100 మీటర్ల పరుగు పందెం, షాట్​పుట్ క్రీడల్లో జిల్లాకు చెందిన గుర్రం పోడు మండలం వద్దిరెడ్డి గూడేనికి చెందిన మేకల భాస్కర్ రెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు.

బంగారు పతకాలతో భాస్కర్ రెడ్డి
రన్నింగ్​లో భారత్​కు బంగారు పతకం

Gold Medals for India in International Championship Srilanka : ఈ క్రీడలు ఈనెల 10 నుంచి శ్రీలంకలో జరుగుతున్నాయి. భారత్ తరఫున రెండు విభాగాల్లో బంగారు పతకాలు గెలవడం చాలా గర్వకారణంగా ఉందని భాస్కర్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో అనేక పతకాలు గెలిచి దేశానికి కీర్తి తెస్తానని తెలిపారు.

శ్రీలంకలో భారత్ విజయం
షాట్​పుట్​లో భారత్​కు బంగారు పతకం

ఇదీ చదవండి : father and son win: అంతర్జాతీయ ఛాంపియన్​షిప్​ పోటీల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు

ABOUT THE AUTHOR

...view details