ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లాలోని పలు దేవాలయాల్లో.. గోదాదేవి-రంగానాథ స్వామివార్ల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు.. వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపారు.
రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి, పానగల్ శ్రీ వేంకటేశ్వరస్వామి, పాతబస్తీ సంతోషిమాత, హైదరాబాద్ రహదారిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాల్లో.. కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి.