- (పల్లెల్లో ఇలా) ఈ చిత్రం: అయిదు వేల జనాభాకు లోబడి ఉన్న నల్గొండ మండలం నర్సింగ్‌భట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్‌యార్డు.
- (పట్టణంలో అలా) ఈ చిత్రం సుమారు 15వేల జనాభాకుపైగా నివాసముంటున్న చౌటుప్పల్ పట్టణంలోనిది. అక్కడా డంపింగ్ యార్డు లేకపోవడంతో పట్టణంలో పోగైన వ్యర్థాలను పట్టణ శివారులోని ఖాళీ స్థలంలో పారబోసిన దృశ్యం.
సూర్యాపేట జిల్లాలో...
- తిరుమలగిరి మున్సిపాలిటీలో నిత్యం 3 టన్నుల వ్యర్థాలు సేకరిస్తున్నారు. డంపింగ్‌యార్డు లేకపోవడంతో పట్టణ పరిసరాల్లో పారబోస్తున్నారు. డంపింగ్‌యార్డు ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు.
- నేరేడుచర్ల పట్టణంలో రోజుకు సుమారు 6 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పొగవుతున్నాయి. వాటిని మిర్యాలగూడ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పారబోస్తున్నారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడంలో చిత్తశుద్ధి కరవైంది.
యాదాద్రి జిల్లాలో పరిశీలిస్తే..
- చౌటుప్పల్ పురపాలికలో చెత్త డంపింగ్ యార్డు లేక ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు. పట్టణంలో పోగవుతున్న 10 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ఖాళీ స్థలాల్లో పారబోస్తున్నారు.
- ఆలేరు పట్టణంలో డంపింగ్‌యార్డు నిర్మించేందుకు ఒకటిన్నర ఎకరం స్థలం ప్రతిపాదించారు. అక్కడా ఎలాంటి నిర్మాణాలు, సౌకర్యాలు కల్పించకపోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది సేకరించిన వ్యర్థాలను పెద్దవాగు సమీపంలో పారబోస్తున్నారు.
- యాదగిరిగుట్టలో పారిశుద్ధ్యం పడేకేసింది. నిత్యం 20 టన్నుల మేర వ్యర్థాలు చెత్త పోగవుతోంది. ప్రస్తుతం గుండ్లపల్లి శివారులో కాల్వలో వ్యర్థాలు పారబోస్తున్నారు. గతంలో వైటీడీఏ చెత్తశుద్ధి కేంద్రానికి 5 ఎకరాల స్థలం కేటాయించినప్పటికీ అందులో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. అది నిరుపయోగంగా ఉంది.
ప్రతిపాదనల్లోనే డంపింగ్‌యార్డులు! - చండూరు మున్సిపాలిటీలో నిత్యం 5 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి. డంపింగ్‌యార్డు కోసం 2.9 ఎకరాలు ప్రతిపాదనలో ఉంది. ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం సేకరించిన చెత్త, వ్యర్థాలను పట్టణ శివారు ప్రాంతాల్లోని రోడ్లు, ఖాళీ ప్లాట్లో పారబోస్తున్నారు.
- నందికొండ మున్సిపాలిటీలో రోజు 6 టన్నులకు పైగా చెత్త సేకరిస్తున్నారు. ప్రత్యేకంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకపోవడంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల పక్కన వ్యర్థాలను పారబోస్తున్నారు.
- చిట్యాల పట్టణంలో ఇప్పటి వరకు డంపింగ్ యార్డు ఏర్పాటు చేయలేదు. చెత్తశుద్ధి కేంద్రాలు లేకపోవడంతో పట్టణంలో వెలువడుతున్న సుమారు 8 మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణం వెలుపల ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. కనీసం డంపింగ్ యార్డుకు స్థలం ప్రతిపాదనలకు కూడా నోచుకోలేదు.
- హాలియా మున్సిపాలిటీలో వ్యర్థాల పారబోతకు డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసినప్పటికి అక్కడా మౌళిక సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో చెత్త శుద్ధి, వ్యర్థాల వేరు చేయడం పనులు జరగడంలేదు. పూర్తి స్థాయిలో తడి, పొడి చెత్త సేకరణ అమలు కావడంలేదు.
ఏదీ చెత్త శుద్ధి!