తెలంగాణ

telangana

ETV Bharat / state

Help: అనాథలైన చిన్నారులను ఆదుకున్న దాతలు - తెలంగాణ వార్తలు

తొమ్మిది నెలల వ్యవధిలో అమ్మనాన్నను పోగొట్టుకుని అనాథులుగా మాారిన చిన్నారులను ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చారు. విద్యుత్​ షాక్​తో​ తండ్రి, కరోనాతో తల్లి చనిపోవటంతో అనాథులుగా మారిన వారి పిల్లలకు ఆర్థిక సాయం(Help) అందించారు నల్గొండ జనగణమణ ఉత్సవ కమిటీ సభ్యులు.

Help: అనాథలైన చిన్నారులను ఆదుకున్న దాతలు
Help: అనాథలైన చిన్నారులను ఆదుకున్న దాతలు

By

Published : Jun 4, 2021, 4:52 PM IST

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురానికి చిలుకలు వెంకన్న( 35) వెల్డింగ్​ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆయనకు భార్య స్వప్న ఉన్నారు. ఆమె మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. వీరికి నేహా(3), వర్షిత్​(1) ఇద్దరు పిల్లలున్నారు. వెంకన్న 9 నెలల క్రితం విద్యుతాఘాతంతో మృతి చెందారు.

అనాథులుగా చిన్నారులు

గత నెలలో స్వప్న కరోనా బారిన పడింది. మే21న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 9 నెలల వ్యవధిలో తల్లిదండ్రులు మరణించటంతో లోకం తెలియని ఆ పసివాళ్లు అనాథలుగా మారారు. వారి భారం నానమ్మ కాంతమ్మపై పడింది. గతనెల 31న ఈటీవీ భారత్​లో ఈ విషయమై కథనం ప్రసచురితమైoది.

స్పందించిన దాతలు

ఈ కథనానికి స్పందించిన నల్గొండ జనగణమణ ఉత్సవ కమిటీ ఛైర్మన్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ ట్రెజరరీ అధికారి కర్నాటి విజయ్ కుమార్ పిల్లలను ఆదుకునేేేందు(Help)కు ముందుకు వచ్చారు. కమిటీ సభ్యులు మంగళవారం ముకుందాపురం వచ్చి స్థానిక సర్పంచ్ శంకర్ సమక్షంలో 50 కేజీల బియ్యం, నిత్యావసర సరకులు, రూ.10వేల ఆర్థిక సహాయం చేశారు. పెద్దనాన్న రాములు పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. చిన్నారులను దాతలు ఆదుకోవాలని సర్పంచ్​ కోరారు.

ఇదీ చదవండి:సర్కార్​కు షాక్​- 3,000 మంది వైద్యుల రాజీనామా

ABOUT THE AUTHOR

...view details