తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి నల్గొండలో కరోనా కలకలం

నల్గొండ జిల్లాలో కరోనా కేసులు కలవరం రేపుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో వెలుగు చూస్తున్న కరోనా కేసులను జిల్లాల లెక్కల్లో చేర్చడంలో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు రోజురోజుకు కరోనా పాజిటివ్​ కేసులు పెరగడం వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Corona Cases In Nalgonda District
ఉమ్మడి నల్గొండలో కరోనా కలకలం

By

Published : Jun 27, 2020, 9:40 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసులు ప్రజల ఆందోళనను రెట్టింపు చేస్తున్నాయి. ప్రతిరోజూ పాజిటివ్​ కేసులు బయటపడుతున్నా.. వాటిని జిల్లాల లెక్కల్లో చేర్చడంలో అయోమయం నెలకొంది. నల్గొండ జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ కాగా.. అందులో మిర్యాలగూడకు చెందిన ఇద్దరు, దేవరకొండ, కేతేపల్లి, నిడమనూరులలో ఒక్కొక్కరు, నల్గొండ 12వ బెటాలియన్​లో ఒక కానిస్టేబుల్​కు వైరస్​ సోకింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు కరోనా కేసులు వెలుగు చూడగా.. అందులో నలుగురు నల్గొండ జిల్లా వాసులున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. చింతపల్లికి మండలానికి చెందిన మహిళ ఇప్పటికే కరోనా చికిత్స పొందుతూ హైదరాబాద్​ ఆస్పత్రిలో మరణించింది. ఈ కేసులు యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలా? నల్గొండ జిల్లాలో కలపాలా? అని అధికారులు ఆలోచనలో పడ్డారు.

ఇవీచూడండి:గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ABOUT THE AUTHOR

...view details