EC Notices to Rajagopal Reddy: మునుగోడు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. రాజగోపాల్‌రెడ్డి సంస్థ నుంచి దాదాపు రూ.5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని, ఆ డబ్బంతా మునుగోడు ఉపఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని తెరాస ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. తెరాస ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసింది. రేపు సాయంత్రం 4 గంటలలోపు వివరణ ఇవ్వాలని.. లేదంటే తగు చర్యలు తీసుకుంటామని ఆదేశించింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించిన ఈసీ.. తెరాస ఫిర్యాదును రాజగోపాల్‌రెడ్డికి తెలపాలని సూచించింది.
తెరాస ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు - Rajagopal Reddy
22:32 October 30
తెరాస ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్‌రెడ్డికి నోటీసులు
అసలేం జరిగిందంటే..:మునుగోడు భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి చెందిన సంస్థ నుంచి భారీగా నగదు.. పలువురు వ్యక్తులు, స్థానిక వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి తెరాస ఫిర్యాదు చేసింది. రాజగోపాల్ రెడ్డి సంస్థ నుంచి దాదాపు రూ.5.22 కోట్లు స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 23 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ డబ్బంతా మునుగోడు ఉప ఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని తెరాస ఆరోపించింది. ఖాతాల నుంచి డబ్బులు తీసుకోకముందే 23 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కోరింది.
ఓటర్లకు పంపిణీ చేసేందుకే భారీగా నగదును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారని తెరాస ఆరోపించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని తెరాస నేత భారతి కుమార్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా చర్యలు సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తక్షణమే రాజగోపాల్‌రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: