తెలంగాణ

telangana

ETV Bharat / state

నా పయనం కేసీఆర్​తోనే: జూపల్లి కృష్ణారావు

గత కొంతకాలంగా తాను తెరాస పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహజమని వెల్లడించారు.

The news that TRS party is changing is unreal Clarity by Jupally Krishnarao
నా పయనం కేసీఆర్​తోనే: జూపల్లి కృష్ణారావు

By

Published : Feb 3, 2020, 6:03 PM IST

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో, కొన్ని ఛానళ్ల​లో తాను వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వదంతులను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. తాను ఏ పార్టీలో చేరే ప్రసక్తి గానీ.. ఆలోచన కానీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ చేసే అభివృద్ధిలో భాగమవుతానని పేర్కొన్నారు.

తనంటే పడనివారు, గిట్టనివారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇకనైనా వదంతులకు ముగింపు పలకాలని ఆయన కోరారు. ఇటీవల కొల్లాపూర్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో తన వెంట 20 ఏళ్ల నుంచి ఉన్న అనుచరులు పోటీ చేసి ప్రజల ఆదరణతో గెలిచారని తెలిపారు. ఆత్మాభిమానం కోసం పోటీ చేసిన వాళ్లందరూ తెరాస పార్టీకి చెందిన వారేనని జూపల్లి స్పష్టం చేశారు.

నా పయనం కేసీఆర్​తోనే: జూపల్లి కృష్ణారావు

ఇదీ చదవండిఃభారీగా ఐఏఎస్​ల బదిలీలు... కొత్త పోస్టింగ్​లు ఇవే..

ABOUT THE AUTHOR

...view details