ఈ నెల 3న అచ్చంపేట మండలం పులిజాల గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నల్లమల అడవుల్లో వేటాడేందుకు తుపాకీతో బయలుదేరుతున్నారు... అనే సమాచారంతో పోలీసు అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా... తుపాకులను అక్కడే వదిలేసి... ఆ వ్యక్తులు అక్కడ నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నాటు తుపాకీలతో వేట...నలుగురి అరెస్ట్
నాటు తుపాకులు కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి... రిమాండ్కు తరలించిన ఘటన అచ్చంపేటలో చోటు చేసుకుంది. నిందితులను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ నరసింహులు అభినందించారు.
నిన్న పులిజాల గ్రామంలో నిందితులు శేఖర్, సాయిబాబు, విష్ణుని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక నాటు తుపాకీని స్వాధీనపరుచుకున్నారు. వీరు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నివసించే ఆర్.వెంకట్ అనే వ్యక్తి దగ్గర నుంచి నాటు తుపాకి కొనుగోలు చేసినట్టు తెలిపారు. పోలీసులు అతనిని కూడా అరెస్టు చేశారు. ఈ నలుగురిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి డీఎస్పీ నరసింహులు అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి:'హై రిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి'