రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రెవిన్యూ దర్బార్ నిర్వహించారు. అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి భూతగాదాలు పరిష్కరించాలన్నారు. కోర్టు కేసులు, అన్నదమ్ముల మధ్య వివాదాలున్న భూములు తప్ప మిగతా అన్ని ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రెవెన్యూ దర్బార్
నాగర్కర్నూల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రెవెన్యూ దర్బార్ నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
భూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రెవెన్యూ దర్బార్