తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగర్​ కర్నూల్​ పీఠం తెరాసదే...

నాగర్​ కర్నూల్​ జిల్లా పరిషత్​ ఛైర్మన్​ పదవిని తెరాస దక్కించుకోబోతోంది. అత్యధిక స్థానాల్లో గెలిపిచిన అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించబోతోంది. ఈ ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నిరంజన్​ రెడ్డితో జడ్పీటీసీ సభ్యులు

By

Published : Jun 8, 2019, 10:19 AM IST

నాగర్​ కర్నూల్​ అధ్యక్ష పీఠాన్ని తెరాస అధిష్ఠించబోతోంది. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీలు ఉండగా తెరాస 17 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్​ మూడు జడ్పీలకే పరిమితమైంది. ఛైర్మన్​ పదవికి నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తనయుడు పోతుగంటి భరత్ ప్రసాద్ పేరు వినిపించినా... అనూహ్యంగా జిల్లా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.... తెల్కపల్లి మండల జడ్పీటీసీగా గెలుపొందిన పెద్దపల్లి పద్మావతి బంగారయ్యకు జడ్పీ అధ్యక్ష బిఫాం అందజేశారు. వైస్ ఛైర్మన్​గా తెలంగాణ ఉద్యమ నాయకుడు బాలాజీ సింగ్​కు దక్కనున్నట్లు సమాచారం

ఏర్పాట్లు పూర్తి

పరిషత్ ఛైర్మన్​ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 1:00 గంట వరకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. 3 గంటలకు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ మరియు వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక జరగనుంది.
ఇవీ చూడండి: ఏకగ్రీవమే లక్ష్యంగా తెరాస ప్రణాళికలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details