నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గంలో పెద్దకొత్తపల్లి మండలం బాచారంలో కెఎల్ఐ ప్రధాన కాలువ పనులకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి భూమిపూజ చేశారు. కాలువ కోసం సర్వే పనులను ఎమ్మెల్యే దగ్గరుండి పరిశీలించారు.
కేఎల్ఐ కాలువకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో కేఎల్ఐ కాలువకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కాలువ ద్వారా మండలంలోని సుమారు పదివేల ఎకరాలకు సాగునీరందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బాచారం హై లెవల్ కెనాల్‌తో పెద్దకొత్తపల్లి మండలం పరిధిలోని సుమారు పదివేల ఎకరాలకు సాగునీటి కష్టాలు తీరుతాయని ఎమ్మెల్యే పేరొన్నారు. మే నెలలో పూర్తి స్థాయి డీపీఆర్ తయారు చేసి.. టెండర్లు పిలిచి పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎస్ఈ విజయభాస్కర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్ రెడ్డి తెరాస నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:లక్షణాలు కనిపిస్తే చాలు కొవిడ్ చికిత్స.. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు..!