నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన పర్వతాలు అనే రైతు అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. పర్వతాలుకు చెందిన భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వారి పేరు మీద పట్టా చేసుకున్నారని పలుమార్లు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్పందించి రైతు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - farmer-sucide-atempt
తన భూమిని వేరే వ్యక్తుల పేరు మీద పట్టా చేసుకున్నారని తహశీల్దారుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
రైతు ఆత్మహత్యాయత్నం