నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీరం ఫౌండేషన్ కష్టకాలంలో అభాగ్యుల ఆకలి తీర్చుతుంది. లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటి నుంచి దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు, ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఆహారం అందిస్తోంది.
ఆపద సమయంలో ఆకలి తీర్చుతున్న బీరం ఫౌండేషన్
గడప దాటితే కొవిడ్ భయం.. లోనే ఉంటే ఆకలి బాధలు. తప్పని పరిస్థితిలో దూర ప్రయాణాలు. కొవిడ్ బారిన పడి ఐసోలేషన్‌లో ఉంటే వైరస్ కంటే ముందే ఆకలితోనే ప్రాణం పోయే పరిస్థితి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌లో బీరం ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం, మధ్యాహ్నం చికెన్, రాత్రిపూట గుడ్డుతో అన్నం అందిస్తున్నట్లు కొల్లాపూర్ పురపాలిక ఛైర్పర్సన్ విజయలక్ష్మి చెప్పారు. లాక్డౌన్ సమయంలో కొవిడ్ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందుకోసమే ఐసోలేషన్‌లో ఉంటున్న వారి కోసం ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆహారం దొరక్క సతమతవుతుండడం వల్ల వారికి భోజన వసతి కల్పిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి:లాక్‌డౌన్‌తో ఉపాధి కరవాయె.. పిల్లలకు పట్టెడన్నం వరమాయె.!