తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారాలమ్మ మహా జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు. జనజాతరకు అనేక కుటుంబాలు కలిసి మేడారం చేరుకుంటారు. కానీ ఆ జనసముద్రంలో కలసి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మాత్రం అందరూ కలిసి వెళ్లడం మాత్రం అసాధ్యంగా మారుతోంది. ఒకవేళ వారితో నడువలేక ఎక్కడైనా ఆగినా, ఏదైనా అవసరం పడి మళ్లీ వాళ్లని ఆ జనంలో వెతకాలంటే తిప్పలే. అందుకే మేడారంలో ఎటు చూసినా జెండలే దర్శనమిస్తున్నాయి.
మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే.. - ములుగు జిల్లా వార్తలు
మేడారం సమ్మక్క సారాలమ్మ మహా జాతరకు భక్తులు పోటెత్తున్నారు. రద్దీతో కొన్నిసార్లు పలువురు తప్పిపోతుండటం జరుగుతుంది. తమ కుటుంబ సభ్యులు తప్పిపోకుండా ఉండేందుకు రకరకాల జెండా గుర్తులను పెట్టుకుని నడుస్తున్నారు.
మేడారంలో ఆ జెండాను చూస్తూ నడవాల్సిందే
కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు వారిలో ఎవరూ దారి తప్పకుండా ఉండేందుకు ఓ గుర్తును పెట్టుకుంటారు. కుటుంబంలో ఒక్కరు ఓ గుర్తును కర్రకు చుట్టి ముందు నడుస్తుంటే దానిని చూసుకుంటూ అందరూ వెనుక వెళ్తారు. దానితో సులభంగా అందరూ కలసి జాతరలో తిరుగుతూ సందడి చేస్తున్నారు.
ఇదీ చూడండి :దేవతల ఆగమనం... అట్టహాసంగా మహాజాతర ప్రారంభం
TAGGED:
వెతకాలంటే తిప్పలే