శాంతించిన జంపన్నవాగు..మొదలైన రాకపోకలు - వర్షం
మేడారం సమీపంలోని జంపన్న వాగు ఉద్ధృతి తగ్గింది. రెండు మూడు రోజుల నుంచి మేడారానికి నిలిచిపోయిన రాకపోకలు ఈరోజు మొదలయ్యాయి.
శాంతించిన జంపన్నవాగు..మొదలైన రాకపోకలు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమీపంలో ఉన్న జంపన్నవాగు ఉద్ధృతి తగ్గడం వల్ల సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి వరకు వంతెనను ఆనుకొని వరద నీరు ప్రవహించడం వల్ల ఊరట్టం, నార్లపూర్, మేడారం, కొత్తూరు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల మేడారానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోజు జంపన్న వాగు ప్రవాహం తగ్గడంతో రాకపోకలు మొదలయ్యాయి.
- ఇదీ చూడండి : కాలుష్యం వెదజలిల్లితే కఠిన చర్యలే