తెలంగాణ

telangana

ETV Bharat / state

రాకపోకలు నిలిచిపోయి రోగులకు తీవ్ర ఇక్కట్లు

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మారుమూల అటవీ గ్రామమైన తిప్పాపురానికి చెందిన చింత సుజాత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఆ గ్రామానికి 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రాకపోకలు నిలిచిపోయి రోగులకు తీవ్ర ఇక్కట్లు
రాకపోకలు నిలిచిపోయి రోగులకు తీవ్ర ఇక్కట్లు

By

Published : Aug 22, 2020, 3:29 PM IST

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మారుమూల అటవీ గ్రామమైన తిప్పాపురానికి చెందిన చింత సుజాత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. ప్రధాన రహదారికి సుమారు 7 కి.మీ దూరంలో ఉన్న ఆ గ్రామానికి 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా కురిసిన వర్షాలకు పెంకవాగు, జిన్నెలవాగు ఉద్ధృతి కారణంగా వైద్య సేవలు అందని దిస్థితి నెలకొంది.

చెక్ డ్యామ్ ఆధారంగా...

శనివారం సదరు మహిళ మరింత అనారోగ్యానికి గురైంది. గ్రామస్థులు కాలినడకన వాగు దాటించారు. వాగుల ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇక్కడి అటవీ మార్గంలోని చెక్ డ్యామ్ ఆధారంగా ప్రధాన మార్గానికి చేర్చారు. 108 సాయంతో గిరిజన మహిళను వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ సేవలు అందిస్తున్నారు.

ఇవీ చూడండి : స్త్రీ మూర్తిగా గణనాథుడు.. ఆలయాలు ఎక్కడంటే!

ABOUT THE AUTHOR

...view details