ములుగు జిల్లా పరిధిలోని సదరమ్ సర్టిఫికెట్లు లేని దివ్యాంగులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 805 మంది హాజరై సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాజేడు మండలం బొల్లారానికి చెందిన శ్రీకాంత్‌కు అనారోగ్యంతో కాళ్లు చేతులు పోయాయి. నడవలేని స్థితిలో ఉన్న శ్రీకాంత్ ఆటోలో వచ్చి సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
కలెక్టర్ గారూ కనికరించండి..!
పింఛన్ రాని దివ్యాంగులు సదరమ్ సర్టిఫికేట్ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కలెక్టర్ గారూ కనికరించండి..!