తెలంగాణ

telangana

ETV Bharat / state

కిలోమీటర్ మేర మునిగిపోయిన జాతీయ రహదారి

ములుగు జిల్లాలో గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జంగాలపల్లి సమీపంలో మేడివాగు వద్ద వరద ప్రవాహంతో వరంగల్ నుంచి ఛత్తీస్​గఢ్ - భూపాలపట్నం జాతీయ రహదారి కిలోమీటర్ మేర నీటిలో మునిగిపోయింది.

కిలోమీటర్ మేర మునిగిపోయిన జాతీయ రహదారి
కిలోమీటర్ మేర మునిగిపోయిన జాతీయ రహదారి

By

Published : Aug 21, 2020, 2:22 PM IST

ములుగు జిల్లాలో గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ములుగు మండలం జంగాలపల్లి సమీపంలో మేడివాగు వద్ద వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. వరంగల్ నుంచి ఛత్తీస్​గఢ్ - భూపాలపట్నం జాతీయ రహదారి మేడివాగు వద్ద రహదారిపై కిలోమీటర్ మేర నీటిలో జాతీయ రహదారి మునిగిపోయింది. ఫలితంగా రెవెన్యూ, పోలీస్ అధికారులు రాకపోకలు నిలిపివేశారు.

రామప్పకు భారీ వరద...

రామప్ప సరస్సుకు భారీగా నీరు చేరడం వల్ల 3 ఫీట్ల ఎత్తుతో మత్తడి పోస్తోంది. పాలంపేట సమీపంలో రహదారి మొత్తం నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవీ చూడండి : సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదనలు వినేందుకు ఎన్జీటీ అంగీకారం

ABOUT THE AUTHOR

...view details