ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలలో... అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన పలువురికి.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుమారస్వామి నిత్యావసరాలను పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు.. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్లు మంజూరు చేయాలని కోరారు.
'బాధితులకు.. డబుల్ బెడ్ రూమ్లు మంజూరు చేయండి' - బాధితులకు ఆర్థిక సాయం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో... అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన పలువురికి.. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్లు మంజూరు చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుమారస్వామి కోరారు. తక్షణ సాయంగా బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అగ్ని ప్రమాదంలో ఇళ్లు
ఎమ్మెల్యే సీతక్క సూచనలతో.. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు వంట సామాగ్రి, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసినట్లు కుమారస్వామి వివరించారు. ప్రభుత్వం.. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 50వేలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో.. సర్పంచ్ మౌనికతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పోచంపాడ్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి