తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు జిల్లాలో వర్షం.. నీటమునిగిన పంటలు!

ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.  వాగులు, వంకలు పొంగి పొర్లుతూ.. పంట పొలాలునీట మునిగాయి. వారం క్రితమే వేసిన వరినాట్లు కొట్టుకుపోయి నష్టాల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Continuous Rain in Mulugu district crops drained
ములుగు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం.. నీటమునిగిన పంటలు!

By

Published : Sep 22, 2020, 8:27 AM IST

ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో విరామం లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు నిండి వాగులు, వంకలు పొంగి పొర్లడం వల్ల పంటపొలాలు నీట మునిగాయి. ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు వరిపంట పూర్తిగా నాశనం కాగా.. రైతులు మరోసారి నాట్లు వేశారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు నాట్లు మరోసారి కొట్టుకుపోయాయి. నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details