మేడ్చల్ జిల్లా సాయిరాంనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. దమ్మాయిగూడాలోని ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన విశ్వేశ్వర్ ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. సాయిరాంనగర్ వద్దకు చేరుకోగానే టిప్పర్‌ను ఓవర్ టాక్ చేయబోతూ దాని కింద పడి మృతి చెందాడు. విశ్వేశ్వర్ దక్షిణ మధ్య రైల్వేలో టెక్నికల్ విభాగంలో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎడమవైపుగా వచ్చి ఓవర్ టేక్ చేసినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జవహర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
టిప్పర్‌ను దాటే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురై చనిపోయిన ఘటన మేడ్చల్ జిల్లా సాయిరాంనగర్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రమాదానికి గురైన వాహనం