రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పాత పద్ధతిలోనే కొనసాగించాలంటూ రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్.. మేడ్చల్ జిల్లా కీసర మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టింది. జీవో 131ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ చేయాలని కోరింది.
'ఎల్ఆర్ఎస్తో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు జరగాలి'
ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. కీసర మండలం సబ్‌రిజిస్టార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర రియల్టర్ అసోసియేషన్ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసింది.
'ఎల్ఆర్ఎస్తో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు జరగాలి'
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 25లక్షల మంది ఎల్ఆర్ఎస్ కట్టారని అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య పేర్కొన్నారు. మరో 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ చేయించుకోవాడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ రియలటర్లకు మద్దతుగా వచ్చి ఆందోళనలో పాల్గొనాలని కోరారు.
ఇదీ చదవండి:ఎల్ఆర్ఎస్, 111 జీవో ఎత్తివేయాలని కాంగ్రెస్ నాయకుల ధర్నా