తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదు'

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ మండలం ఏదులాబాద్​లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని... రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు.

MINISTER MALLAREDDY STARTED IKP CENTER IN MEDCHEL
'రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదు'

By

Published : Apr 17, 2020, 11:50 AM IST

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి సూచించారు. మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ మండలం ఏదులాబాద్​లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.

గ్రామాల వారీగా వరి, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏ రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, హమాలీలు సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు.

ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ABOUT THE AUTHOR

...view details