తెలంగాణ

telangana

ETV Bharat / state

'పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం' - మంత్రి మల్లారెడ్డి వార్తలు

హరితహారంలో భాగంగా అందరూ మొక్కలు నాటాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. శామీర్​పేట్ పరిధిలో బిట్స్ క్యాంపస్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్​తో కలిసి హాజరయ్యారు.

minister-mallareddy-in-haritha-haram-programme-at-shamirpet
'పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం'

By

Published : Jun 19, 2020, 1:11 PM IST

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండల పరిధిలోని బిట్స్ పిలాని క్యాంపస్ సమీపంలో హరితహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొని మొక్కలు నాటారు.

ఆరో విడత హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయించారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని సంతోష్ కుమార్ సూచించారు.

ఇవీ చూడండి:13వ రోజూ పెరిగిన పెట్రోల్‌ ధరలు

ABOUT THE AUTHOR

...view details