తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంజినీరింగ్ విద్యార్థి జీవన్​ రెడ్డి ఎక్కడ? - CRIME NEWS IN TELUGU

హైదరాబాద్​లో ఇంజినీరింగ్​ మూడో సంవత్సరం విద్యార్థి కనిపించకుండా పోయి ఐదు రోజులు గడుస్తున్నా... ఎలాంటి ఆచూకీ లేకపోవటం కలకలం రేపుతోంది. పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నా... ఆధారాలు దొరకకపోవటం కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

MALLAREDDY ENGINEERING COLLEGE STUDENT MISSING CASE UPDATES
MALLAREDDY ENGINEERING COLLEGE STUDENT MISSING CASE UPDATES

By

Published : Feb 16, 2020, 5:15 PM IST

మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ పేట్​బషీరాబాద్ పీఎస్ పరిధిలో కనిపించకుండా పోయిన ఇంజినీరింగ్ విద్యార్థి జీవన్ రెడ్డి కేసు మిస్టరీగా మారింది. నల్గొండ జిల్లాకు చెందిన ప్రభోదర్ రెడ్డి కుమారుడు జీవన్ రెడ్డి మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు.

ఈనెల 11న ఉదయం నుంచి కనిపించకుండా పోయిన జీవన్​రెడ్డి... 5 రోజులైనా దొరకలేదు. జీవన్​రెడ్డి ఉండే హాస్టల్ గదిలోని బాత్రూంలో రక్తపు మరకలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మరోవైపు జీవన్​రెడ్డి... ఆన్​లైన్​లో క్యాష్​బీన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకొని క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడేవాడని స్నేహితులు చెబుతున్నారు.

పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నా... ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. తమ కుమారున్ని క్షేమంగా తీసుకురావాలని పోలీసులను జీవన్​ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

ఐదు రోజులైనా ఆచూకీ దొరకని ఇంజినీరింగ్​ విద్యార్థి

ఇదీ చూడండి.. అందమైన భామలు మెచ్చే హ్యాండ్​బ్యాగులు

ABOUT THE AUTHOR

...view details