కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శాంతి విజయ్ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరు మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్ వికలాంగుల కాలనీ సమీపంలో నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో విజయ్ శాంతి మెడపై కత్తెరతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తన కుమారుడితో స్వగ్రామమైన నంద్యాలకు చేరుకున్నాడు.
విజయ్ ప్రవర్తనపై కుటుంబసభ్యులకు అనుమానం కలగడంతో ఇక్కడ నివాసం ఉండే బంధువు ఓబులేష్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అతడు ఇంటికి వెళ్లి చూడగా శాంతి రక్తపు మడుగులో పడి ఉంది. ఓబులేష్ ఇచ్చిన సమాచారం మేరకు జవహార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్యను అంతమొందించిన భర్త
కట్టుకున్న భర్త భార్యను కత్తెరతో గొంతులో పొడిచి చంపిన ఘటన మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
భార్యను అంతమొందించిన భర్త
ఇదీ చూడండి: రాజీవ్ హత్యకేసు నిందితురాలు నళిని విడుదల