మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ద్వారకమయి నగర్ కాలనీలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన తండ్రి కాలయముడై ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు. స్థానికంగా నివాసముండే రాజేష్ వృత్తి రీత్యా ఆటోడ్రైవర్. మద్యానికి బానిసై కూతురిపై గత కొంతకాలంగా అకృత్యానికి పాల్పడుతున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఐదేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం
కన్నతండ్రే ఆ బాలిక పాలిట కాల యముడయ్యాడు. మద్యానికి బానిసై ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. సభ్య సమాజం తల దించుకునే ఈ ఘటన మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లో జరిగింది.
చిన్నారిపై అత్యాచారం