తెలంగాణ

telangana

ETV Bharat / state

గాగిల్లపూర్​ హత్యకేసు: వివాహేతర సంబంధమే కారణం

మేడ్చల్​ జిల్లాలోని దుండిగల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈనెల 15న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. నిందితుడు ఆసిఫ్​, మృతుడి భార్యను అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించారు.

GAGILLAPUR MURDER CASE TRACED ACCUESED ARRESTED
గాగిల్లపూర్​ హత్యకేసు: వివాహేతర సంబంధమే కారణం

By

Published : Jan 25, 2020, 5:10 AM IST

Updated : Jan 25, 2020, 8:25 AM IST

హైదరాబాద్​ దుండిగల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చర్చ్​ గాగిల్లపూర్​ వద్ద ఈనెల 15న జరిగిన యాదగౌడ్​ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు, యాదగౌడ్​ భార్యను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన యాదగౌడ్​ తన కుటుంబంతో కలిసి ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. చర్చ్​ గాగిల్లపూర్​ వద్ద నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఫైనాన్స్​ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. యాదగౌడ్​కు డీసీఎం డ్రైవర్​ ఆసిఫ్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరచూ ఇంటికి వస్తుండడం వల్ల యదగౌడ్​ భార్యతో ఆసిఫ్​కు వివాహేతర సంబంధం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన యాదగౌడ్​ తన భార్యను మందలించాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. యాదగౌడ్​ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 15న సాయంత్రం పథకం ప్రకారం.. యాదగౌడ్​ ఇంటికి వచ్చిన ఆసిఫ్​ మద్యం తాగేందుకు రమ్మని సమీపంలోని డబుల్​ బెడ్​ రూం ఇళ్ల నిర్మాణాల వద్దకు తీసుకెళ్లాడు. మద్యం తాగిన అనంతరం.. యాదగౌడ్​ను ఆసిఫ్​ కత్తితో హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆసిఫ్​ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సహకరించిన యాదగౌడ్​ భార్యను అరెస్ట్​లో చేసి రిమాండ్​కు తరలించారు.

గాగిల్లపూర్​ హత్యకేసు: వివాహేతర సంబంధమే కారణం

ఇవీ చూడండి: 'అమీన్​పూర్​ అత్యాచారం ఘటన అంతా కట్టుకథే'

Last Updated : Jan 25, 2020, 8:25 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details