మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన సాలె సాయి అనే యువరైతు ఉదయం పొలం దున్నుతున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ తీగలు నీళ్లలో పడి ఉండడం గమనించక పోవడం వల్లే కరెంట్ షాక్ కొట్టిందని స్థానికులు తెలిపారు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఆ రైతు ప్రాణం తీసింది... - పొలం రైతు మృతి
మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామంలో పొలం దున్నేందుకు వెళ్లిన యువరైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఆ రైతు ప్రాణం తీసింది...
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు. బాధితుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : చంపింది మద్యమా.. ప్రియురాలా..?