తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువు కట్టపైన తాగాడు... చెరువులో పడ్డాడు..! - died news

ఓ మందు బాబు చెరువు కట్టపై మద్యం తాగాడు. మత్తు ఎక్కువై... అదుపు తప్పి చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా పేట్​బషీరాబాద్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

drinker died drown in lake in medchel
చెరువు కట్టపైన తాగాడు... చెరువులో పడ్డాడు..!

By

Published : May 9, 2020, 4:21 PM IST

చెరువుకట్ట మీద కూర్చొని మద్యం తాగిన ఓ వ్యక్తి మత్తులో అదుపుతప్పి చెరువులో పడి మృతి చెందిన ఘటన మేడ్చల్​ జిల్లా పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. దూలపల్లికి చెందిన సాంబయ్య (45)... కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శుక్రవారం రాత్రి కొంపల్లిలోని ఊరి చెరువు కట్ట పైన మద్యం తాగాడు. కట్ట అంచున కూర్చున్న సాంబయ్య మత్తులో అదుపుతప్పి చెరువులో పడిపోయాడు. పోలీసులకు సమాచారం అందగా... ఘటనాస్థలికి చేరుకుని సాంబయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంబయ్య చెరువులో పడిపోయిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి.

ఇవీచూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details