రేపటి నుంచి రెండో విడత నామపత్రాల స్వీకరణ
స్థానిక ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 26 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఎంపీడీవో వామన రావు తెలిపారు.