మెదక్ జిల్లాలో ఆదివారం నుంచి జరగనున్న ఏడుపాయల జాతరకు వచ్చే భక్తులకు నీటి ఇక్కట్లు ఎదురుకానున్నాయి. మంజీర నది ఒడ్డున అరణ్యంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా అమ్మవారి జాతర నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచిపెద్ద ఎత్తున భక్తులు వస్తారు. నదిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆచారం. ఏడుపాయల్లో నీరు లేనందున అధికారులు సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
భక్తుల సౌకర్యార్థం ట్యాంకర్లు, మోటర్లతో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.పెద్ద ఎత్తున వచ్చే భక్తుల అవసరాలు ఈ తాత్కాలిక చర్యలు ఎంత మేరకు తీరుస్తాయనేది ప్రశ్నార్థకమే అంటున్నారు స్థానికులు.
అమ్మవారికీ నీటి కటకట - HOLY BATH ION RIVER MANJEERA
తాగు, సాగు నీటికి ఆధారమైన జీవనది వట్టిపోవడం వల్ల సకల ప్రాణకోటి నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. అన్నం పెట్టే అన్నదాత నుంచి కోర్కెలు తీర్చే వనదుర్గ అమ్మవారి వరకు కష్టాలు తప్పట్లేవు.
ఏడుపాయల జాతరకు నీటి కొరత
ఇవీ చదవండి:పాక్వన్నీ అసత్యాలు
Last Updated : Mar 1, 2019, 7:50 AM IST