మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామంలో గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడం వల్ల తాగునీటికి తీవ్ర ఇబ్బంది నెలకొంది. గ్రామపంచాయతీ కార్యాలయం ముందు వార్డు సభ్యులు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అధికారులు, సర్పంచ్ రాకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్డు సభ్యులు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా పత్రాలను గాంధీ విగ్రహానికి సమర్పించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని కాళ్లకల్లో 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయితే అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. అధికారులు, సర్పంచ్ స్పందించి నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం నియోజకవర్గంలో నీటి కష్టాలు...
మెదక్ జిల్లాలోని కాళ్లకల్ గ్రామంలో గత కొన్నిరోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడం వల్ల తాగునీటి ఎద్దడి నెలకొంది. ఆగ్రహించిన వార్డు సభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
సీఎం నియోజకవర్గంలో నీటి కష్టాలు...