తెలంగాణ

telangana

ETV Bharat / state

సముద్రాన్ని పిల్ల కాలువలో కలిపారు : మెదక్ డీసీసీ - CONGRESS PROTEST

కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మెదక్ డీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం పాలనాధికారి ధర్మారెడ్డికి వినతి పత్రం అందించారు.

విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ పాలనాధికారికి డీసీసీ వినతి పత్రం సమర్పణ

By

Published : Jun 12, 2019, 3:48 PM IST

సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ మెదక్ పట్టణంలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కొద్దిసేపు ట్రాఫిక్​కు అంతరాయం కలగగా పోలీసులు ఆందోళన విరమింపచేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పాలనాధికారి ధర్మారెడ్డికి విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ వినతి పత్రం సమర్పించారు.
సీఎం కేసీఆర్ పాలనను గాలికి వదిలేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు విమర్శించారు. కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయడం సముద్రాన్ని, పిల్ల కాలువలో కలిపినట్లుగా అభివర్ణించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సోమన్న గారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తెరాసలో సీఎల్పీ విలీనం పట్ల కాంగ్రెస్ ధర్నా

ABOUT THE AUTHOR

...view details