తెలంగాణ

telangana

ETV Bharat / state

విశేష సేవలందిస్తున్న వారికి ఉమ్మడి మెదక్​ వందనాలు

కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు ఉమ్మడి మెదక్​​ జిల్లాలో అపూర్వ స్పందన లభించింది. మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల ప్రజలంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొని... స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

By

Published : Mar 23, 2020, 12:56 PM IST

Old medak Curfew
Old medak Curfew

ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్​ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ఉమ్మడి మెదక్​​ జిల్లా ప్రజలంతా సంఘీభావం ప్రకటించారు. ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. కొవిడ్​-19​ వ్యాప్తి నివారణ కోసం అహర్నిశలు కృషిచేస్తున్న వారందరి సేవలను కొనియాడుతూ... మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట​ జిల్లాల ప్రజలు కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు.

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు... ప్రాణాలుపణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య, పోలీస్, ఫైర్ సిబ్బందికి రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్​రావు... హైదరాబాద్​లోని తన నివాసంలో కుటుంబ సమేతంగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపారు.

వృత్తి ధర్మాన్ని చాటుతూ కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తోన్న వారందరికి సిద్దిపేట జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్, మున్సిపల్ ఛైర్మన్ కడవేర్గు రాజనర్సు, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఇతర అధికారులు చప్పట్లతో మద్దతు ప్రకటించారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి.

విశేష సేవలందిస్తున్న వారికి ఉమ్మడి మెదక్​ జిల్లా ప్రజల వందనాలు

ఇదీ చూడండి :రైతు బజార్లు కిటకిట... ధరలు భగభగ

ABOUT THE AUTHOR

...view details