తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవసరం ఉన్న వారే బ్యాంకుల వద్దకు రావాలి'

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్సై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అనవసరంగా ప్రజలు బ్యాంకుల వద్దకు రావద్దంటూ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని విధుల్లో తిరుగుతూ లాక్‌డౌన్‌ నిబంధనల గురించి ప్రచారం చేస్తున్నారు.

narsapur si
'అవసరం ఉన్న వారే బ్యాంకుల వద్దకు రావాలి'

By

Published : Apr 16, 2020, 2:09 PM IST

ప్రజలు అనవసరంగా రోడ్డుపైకి రావద్దని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. పట్టణంలోని పలు విధుల్లో తిరుగుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత ఖాతాల్లో వేసిన డబ్బులు తీసుకోవడానికి.. అవసరం ఉన్నవారు మాత్రమే బ్యాంకుల వద్దకు రావాలని సూచించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. కేటాయించిన సమయంలోనే దుకాణాలు తెరచి ఉంచాలని పునరుద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details