రైతు శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగుతోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వనదుర్గ ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు ఫతేనహార్ కెనాల్ ద్వారా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కెనాల్ వద్ద గంగమ్మకు పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వాల పాలనలో సింగూర్ ప్రాజెక్టు ద్వారా ఘనపూర్ ఆనకట్టకు నీరు వదలాలంటే రైతులంతా రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వచ్చేదని ఎమ్మెల్యే ఆరోపించారు. నాయకులు సైతం మంత్రుల వెంట తిరగాల్సివచ్చేదని విమర్శించారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే సమయానికి అనుగుణంగా రైతులకు అవసరమైనప్పుడు ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతున్నారని వెల్లడించారు. త్వరలో కాళేశ్వరం జలాలు జిల్లాకు రానున్నాయని చెప్పారు. ఈ నీరు వనదుర్గ ప్రాజెక్టుకు చేరితే ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్స్ ద్వారా చివరి గ్రామాలకు కూడా సాగు, తాగు నీటి సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నదాతల ఆనందం