మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో రోటో వైరస్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సకాలంలో చిన్నారులకు టీకాలు వేయాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రభుత్వం వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. టీకాల పంపిణీలో క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి రసూల్, ఇతర అధికారులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆరోగ్యకర సమాజం కోసమే టీకాల పంపిణీ: కలెక్టర్ - medak collector dharma reddy
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రోటా వైరస్ పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీకాల పంపిణీలో ఆశా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఆరోగ్యకర సమాజం కోసమే టీకాల పంపిణీ: కలెక్టర్