తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచినీటి కోసం జనావాసాల్లోకి వన్యప్రాణులు - వన్యప్రాణులు

అధిక ఉష్ణోగ్రతలు, ఆహారం కొరత, తాగు నీటి లేమి వెరసి వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. మెదక్​ జిల్లాలో ఓ దుప్పి నీటి కోసం వచ్చి ఊబిలో చిక్కుకుపోయింది.

వన్య ప్రాణులు

By

Published : Apr 4, 2019, 5:51 AM IST

జనావాసాల్లోకి వన్యప్రాణులు
అడవుల్లో ఆహారం, తాగునీరు దొరక్క వన్య ప్రాణులు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం పర్వతాపూర్​ గ్రామ శివారులో నీటి కోసం వచ్చిన ఓ దుప్పి ఊబిలో చిక్కుకు పోయింది. దీనిని గుర్తించిన రైతులు బయటకు తీసి అటవీ అధికారులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపూర్​ గ్రామంలోకి వచ్చిన జింక తీవ్రగాయాలపాలైంది. గమనించిన స్థానికులు ప్రథమ చికిత్స చేసి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details