జిల్లాలో కొద్దిపాటి వర్షానికి అక్కడక్కడా కొంతమంది రైతులు మొక్కజొన్న, పత్తి వేశారు. ఆ పంటల్లో కలుపు తీయడానికి కూలీలు రాక రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు శంకర్ వినూత్నంగా ఆలోచించాడు. కూలీల సమస్యను అధిగమించేందుకు వినూత్నంగా ఈ అన్నదాత సైకిల్ పరికరాలతో చిన్నపాటి మార్పులు చేసి కలుపుతీత పరికరం తయారుచేశాడు. కౌలుకు తీసుకున్న నాలుగు ఎకరాల పొలంలో పత్తి, మొక్కజొన్న వేశాడు. కలుపు తీయడానికి ప్రస్తుతం దీనిని ఉపయోగిస్తున్నాడు.
వెయ్యి ఖర్చుతో తయారీ...