తెలంగాణ

telangana

By

Published : Nov 7, 2020, 3:47 PM IST

ETV Bharat / state

సీఐటీయూ ఆధ్వర్యంలో ఎస్సీలు, ముదిరాజుల ధర్నా

మెదక్​ జిల్లా బూర్గుపల్లిలో అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని, మత్స్యకార సంఘాలకు చేపలు పట్టే అవకాశం కల్పించాలని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఎస్సీలు, ముదిరాజులు ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్​ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.

burgupally villagers protested for ambedkar statue in medak district
అంబేడ్కర్​ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ధర్నా

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం బూర్గుపల్లిలో అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని, మత్స్యకార సంఘాలకు చేపలు పట్టే అవకాశం కల్పించాలని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఎస్సీలు, ముదిరాజులు ధర్నా నిర్వహించారు. బూర్గుపల్లి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి స్థలం కేటాయించాలని కోరగా.. సర్పంచ్ భర్త మల్లేష్ కేటాయింపు విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మత్స్యకార కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ ఆరోపించారు. తక్షణమే అంబేడ్కర్​ విగ్రహానికి స్థలం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

అంబేడ్కర్​ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ధర్నా
బూర్గుపల్లిలో 40 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని... వారిని చేపలు పట్టుకోకుండా మున్నూరుకాపు పెద్దలు వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. 2019లో మత్స్య కార్మికుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారన్నారు. చట్టబద్దంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న మత్స్య సహకార సంఘానికి చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలని మత్స్య సహకారం సంఘం సభ్యులు అధికారులను కోరారు. అనంతరం అదనపు కలెక్టర్​ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details