తెలంగాణ

telangana

ETV Bharat / state

యాంత్రీకరణే లాభదాయకం:శాస్త్రవేత్త శ్రీనివాస్

యాంత్రిక పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. శ్రమ కూడా తగ్గుతుందని అంటున్నారు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్.

యాంత్రీకరణే లాభదాయకం:శాస్త్రవేత్త శ్రీనివాస్

By

Published : Jul 6, 2019, 10:29 PM IST

యాంత్రీకరణతో సమయం ఆదాతో పాటు దిగుబడి పెరుగుతోందని సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్‌ తెలిపారు. సంగారెడ్డి ఏరువాక కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రామాయంపేట మండల పరిధి సుతారిపల్లికి చెందిన అశోక్‌ పొలంలో మల్టీ క్రాఫ్ట్‌ వాక్యూమ్‌ ప్లాంటర్‌ యంత్రాన్ని వినియోగించారు. క్షేత్ర స్థాయి ప్రదర్శన నిర్వహించి, విత్తనాన్ని విత్తే విధానం పై అవగాహన కల్పించారు. ఈ యంత్రం విత్తనాన్ని సరైన విధానంలో నాటుతుంది. తద్వారా అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పరశురాం నాయక్‌ తెలిపారు.

ఈ యంత్రాలను రాయితీపై రైతులకు అందించేలా ప్రభుత్వానికి విన్నమిస్తామని అన్నారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రయోగాత్మకంగా 150 ఎకరాల్లో విత్తనం వేయనున్నట్లు తెలిపారు. మెదక్‌ జిల్లా సుతారిపల్లి, సంగారెడ్డి జిల్లా రాయినిపల్లిలో 50 ఎకరాలు, సిద్దిపేట జిల్లా ఇర్కోడులో 50 ఎకరాలను ఎంపిక చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రైసస కన్వీనర్‌ సోములు, శాస్త్రవేత్త స్పందన, రామాయంపేట వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణ, సర్పంచ్​ సంధ్య, ఏవో రాజ్‌ నారాయణ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తాగిన మత్తులో ఫేక్​కాల్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ABOUT THE AUTHOR

...view details